
Andhra News: తండ్రీకుమారుల దాడి.. వార్డు వాలంటీర్ మృతి
తెనాలి: తన దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు వార్డు వాలంటీర్‌పై తండ్రీకుమారులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని మారిస్పేటలో చోటుచేసుకుంది. ఈ దాడిలో వాలంటీర్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి పట్టణంలోని 24వ వార్డుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న సందీప్ (22) నుంచి ఓ బాలుడు రెండు నెలల క్రితం రూ.2 వేలు అప్పుగా తీసుకున్నాడు. తమకు డబ్బులు అవసరమయ్యాయని తిరిగి ఇవ్వాలని వాలంటీర్ అడగగా బాలుడు దురుసుగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో గొడవ జరగడంతో మాటా మాటా పెరిగి ఇరువైపులా దాడి చేసుకున్నారు.
ఈ క్రమంలో బాలుడు, అతడి తండ్రి వెంకటేశ్వర్లు సందీప్ గుండెపై బలంగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని బంధువులు మారిస్‌పేటలోని తమ ఇంటికి తీసుకెళ్లారు. సందీప్ తండ్రి ఇదివరకే మృతి చెందారని.. తల్లికి మాటలు రావని స్థానికులు తెలిపారు. కుటుంబ పోషణ సందీపే చూసుకుంటున్నాడని.. ఓ పక్క వాలంటీర్‌గా ఉంటూ ఖాళీ సమయాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: శార్దూల్ ఔట్.. టీమ్ఇండియా ఏడో వికెట్ డౌన్
-
World News
Turkey: టర్కీ అదుపులో రష్యా ధాన్యం రవాణా నౌక
-
Movies News
Naga Chaitanya: నేను ఏదైనా నేరుగా చెప్తా.. ద్వంద్వార్థం ఉండదు: నాగచైతన్య
-
Business News
Start Ups: ఈ ఏడాది స్టార్టప్‌లలో 60 వేల ఉద్యోగాల కోత!
-
Politics News
Telangana News: నేనేం మాట్లాడినా పార్టీ కోసమే.. త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తా: జగ్గారెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!