Guntur: చిరు వ్యాపారిని చితకబాదిన పోలీసులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కర్ఫ్యూ ఆంక్షల పేరిట ఓ చిరు వ్యాపారిని చితకబాదిన ఖాకీలు మూల్యం చెల్లించుకున్నారు. పండ్ల దుకాణం వ్యాపారిపై చేయిచేసుకున్న ఒకటో పట్టణ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు....

Updated : 09 May 2021 14:45 IST

నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలో కర్ఫ్యూ ఆంక్షల పేరిట ఓ చిరు వ్యాపారిని చితకబాదిన ఖాకీలు మూల్యం చెల్లించుకున్నారు. పండ్ల దుకాణం వ్యాపారిపై చేయిచేసుకున్న ఒకటో పట్టణ ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. ఒకటో పట్టణ ఎస్సై వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి గురువారం రాత్రి గస్తీకి వెళ్లారు. ఆ సమయంలో పల్నాడు రోడ్డులో నరసయ్య అనే పుచ్చకాయల వ్యాపారి దుకాణం తీసి ఉంచాడు. కర్ఫ్యూ అమల్లో ఉండగా దుకాణం ఎందుకు తీశావని పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతడిపై దాడి చేశారు. అనంతరం బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీసుల దురుసు ప్రవర్తన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. సదరు దృశ్యాలను వ్యాపారి ఉన్నతాధికారులకు పంపగా ఎస్సై వెంకటేశ్వరరావుతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ విజయ్‌ భాస్కర్‌ వెల్లడించారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని