Crime: మహిళపై దాడి చేస్తుంటే..వీడియోలు తీస్తూ చోద్యం..

మధ్యప్రదేళ్‌లోని భోపాల్‌లో కొందరు వ్యక్తులు ఓ మహిళను కర్రలతో దారుణంగా కొట్టి గాయపరిచిన ఘటన చోటుచేసుకొంది.

Updated : 22 Jun 2024 12:26 IST

భోపాల్: ఓ మహిళపై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లోని ధార్ జిల్లాకు చెందిన తండా ప్రాంతంలో చోటుచేసుకొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కొందరు వ్యక్తులు బాధితురాలిపై కర్రలతో దాడి చేస్తూ దారుణంగా కొడుతుండగా తనను కాపాడాలని ఆమె అక్కడ ఉన్నవారిని వేడుకుంటోంది. అయితే చుట్టూ ఉన్నవారు మాత్రం ఆమెను కాపాడడానికి బదులుగా ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తూ చోద్యం చూశారు. తాజాగా కేంద్రమంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్(Savitri) స్వగ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. మనుషల్లో మానవత్వం దిగజారిపోతుందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుండడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన ముఖ్యమైన నిందితుడిని గంధ్వాని ప్రాంత నివాసి నిర్సింగ్‌గా గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మిగిలినవారిని త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు. 

ఇటీవల మే నెలలో ఇదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లాలో కొందరు వ్యక్తులు వృద్ద దంపతులను తీవ్రంగా కొట్టి, వారి మెడలో బూట్ల దండలు వేసి ఊరేగించారు. వారి కుమారుడు అమ్మాయిల వెంట పడుతుండడంతో అతడి తల్లిదండ్రులను ఈవిధంగా దండించినట్లు వారు తెలిపారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని