మాస్కు లేదని జరిమానా.. మార్షల్‌పై మహిళ దాడి

మాస్కు ధరించలేదని జరిమానా విధించిన మహిళా మార్షల్‌పై ముంబయిలో దాడి జరిగింది. కరోనా పెరుగుదల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) జరిమానా వసూలు చేస్తోంది....

Published : 21 Mar 2021 02:01 IST

ముంబయి: మాస్కు ధరించలేదని జరిమానా విధించిన మహిళా మార్షల్‌పై ముంబయిలో దాడి జరిగింది. కరోనా పెరుగుదల దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కు లేకుంటే బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌(బీఎంసీ) జరిమానా వసూలు చేస్తోంది. దీనిని అమలు చేసేందుకు మార్షల్స్‌ను నియమించింది.

అయితే ముంబయిలోని కండీవాలీలో మహవీర్‌నగర్‌ లింక్‌ రోడ్డు వద్ద జైనాద్‌ షేక్‌ అనే మహిళ మాస్కు లేకుండా బయటకు వెళ్లింది. ఇది గమనించిన అశ్విన్‌ గుంజన్‌ అనే మహిళా మార్షల్‌ జైనాద్‌ షేక్‌కు జరిమానా విధించారు. జరిమానా కట్టమని అడిగినందుకు మార్షల్‌పై జైనాద్‌ షేక్‌ దాడి చేసింది.  ‘నన్నే ఆపుతావా? నన్నే ముట్టుకుంటావా?’ అంటూ పూనకం వచ్చినట్లు సదరు ఉద్యోగినిపై దాడికి పాల్పడింది. మార్షల్‌ అశ్విని ఫిర్యాదు మేరకు జైనాద్‌ షేక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని