Crime news: అత్యాచారానికి యత్నించి.. వేడి కత్తితో కళ్లపై కాల్చి!
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై దుండగులు క్రూరత్వానికి పాల్పడ్డారు. వేడి చేసిన కత్తితో తన కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు....
లలిత్‌పుర్: ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళపై దుండగులు క్రూరత్వానికి పాల్పడ్డారు. వేడి చేసిన కత్తితో కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు. లలిత్‌పుర్ జిల్లా బార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ.. మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన హిమాన్షు, గంగారామ్ అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశంలోకి లాక్కెళ్లి.. అత్యాచారానికి యత్నించారు. అయితే సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు.. లైటర్ వెలిగించి, కత్తిని వేడి చేసి.. మహిళ కళ్లు, కనుబొమ్మలపై కాల్చారు. అనంతరం తీవ్రంగా కొట్టడంతో బాధితురాలు స్పృహ కోల్పోయింది.
మార్కెట్‌కు వెళ్లిన మహిళ ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకటం ప్రారంభించారు. ఓ నిర్జన ప్రదేశంలో స్పహ కోల్పోయిఉండటాన్ని గుర్తించి ఆమెను నేరుగా బార్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం పోలీసుల సూచనతో ఆసుపత్రిలో చేర్చారు. తమ ఇంటి సమీపంలోనే ఉండే ఈ నిందితులు.. మూడు నెలల క్రితం తమ మరదలు, ఆమె భర్తను కూడా ఇదే విధంగా వేధించారని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. కాగా తాజా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల
-
Movies News
Thunivu: ఓటీటీలో ‘తునివు’ వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే..?
-
World News
North Korea: రూ.13.9వేల కోట్లు కొల్లగొట్టిన కిమ్ ‘జాతిరత్నాలు’..!