
Delhi Metro: మెట్రో స్టేషన్‌లో యువతి వద్ద తూటా కలకలం
దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ యువతి వద్ద తూటా ఉండటం కలకలం రేపింది. మెట్రో రైల్వే స్టేషన్‌లో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది 21 ఏళ్ల యువతి లగేజీలో బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారు. డాబ్రీ మోర్ స్టేషన్‌లో భద్రతా సిబ్బంది ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో జరిపిన తనిఖీల్లో ఈ తూటా బయటపడింది. ప్రయాణికురాలు తూటాను తన వెంట తీసుకెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి లేదని, దీనికితోడు మెట్రో స్టేషన్ లోపలికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై నిషేధం ఉండటంతో ఈ కేసు దర్యాప్తును స్థానిక పోలీసులకు అప్పగించారు. దేశ రాజధాని ప్రాంతంలోని మెట్రో నెట్‌వర్క్‌కు ఉగ్రవాద నిరోధక రక్షణ కల్పించే బాధ్యతను సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.