Hyderabad: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి బలవన్మరణం

నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.

Published : 03 Oct 2023 22:05 IST

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన నేహా (19) గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ కేఫ్‌లో పనిచేస్తుంది. అదే కేఫ్‌లో పనిచేస్తున్న సహా ఉద్యోగి  సల్మాన్‌ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో సల్మాన్‌.. గత నెల 30వ తేదీన బాలాపూర్ వెంకటాపురంలోని తన నివాసంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తి మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆమె మంగళవారం తను ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నేహా సోదరి మేఘ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నేహా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని