Khammam: పురుగుల మందుతో వంట.. భర్త, కుమార్తెకు వడ్డించిన మహిళ

మతిస్థిమితం లేని మహిళ పురుగుల మందునే మంచినూనెగా భ్రమించింది. దానితో వండిన కూరను తాను తినటమే కాక భర్తకు, కుమార్తెకు సైతం వడ్డించింది. ఈ క్రమంలో

Updated : 13 Aug 2022 07:06 IST

చికిత్స పొందుతున్న భర్త

తిరుమలాయపాలెం, న్యూస్‌టుడే: మతిస్థిమితం లేని మహిళ పురుగుల మందునే మంచినూనెగా భ్రమించింది. దానితో వండిన కూరను తాను తినటమే కాక భర్తకు, కుమార్తెకు సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్తకూడా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ సంఘటనపై ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ఠాణాలో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడిదపల్లికి చెందిన బండ్ల నాగమ్మ(37) మతిస్థిమితం లేక ఇబ్బందిపడుతోంది. గురువారం ఉదయం ఇంట్లో  మంచినూనెకు బదులుగా పక్కనున్న పురుగుమందుతో కూర వండింది. అనంతరం కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నాన్ని తిన్నాడు. మందువాసన రావటంతో కుమార్తె అన్నాన్ని పడేసింది. నాగమ్మ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని