Road Accidet: స్వల్పంగా ఢీకొన్న లారీ.. అంతర్గత గాయాలతో యువతి మృతి

పరీక్ష రాసేందుకు పుట్టింటి నుంచి కళాశాలకు వెళ్తున్న సందర్భంలో లారీ రూపంలో ఆమెను మృత్యువు వెంటాడింది.

Published : 22 Jun 2024 05:47 IST

గీతావాణి (పాత చిత్రం)

మార్టేరు, న్యూస్‌టుడే: పరీక్ష రాసేందుకు పుట్టింటి నుంచి కళాశాలకు వెళ్తున్న సందర్భంలో లారీ రూపంలో ఆమెను మృత్యువు వెంటాడింది. పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామ పరిధిలో చించినాడ కాలువ కల్వర్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన దేవగానుల గీతావాణి(23) అలియాస్‌ కాసిన గీతావాణి దుర్మరణం చెందారు. రెండేళ్ల కిందట వివాహమైన ఆమె పెనుగొండ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. పరీక్షలు రాసేందుకు అత్తింటి నుంచి వారం రోజుల కిందట పుట్టిల్లు మార్టేరులోని శివరావుపేటకు వచ్చింది. ఇక్కడ నుంచే పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం తన ద్విచక్రవాహనంపై పెనుగొండలోని కళాశాలకు బయలుదేరింది. తన ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించుకుని వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ స్వల్పంగా ఢీకొన్నది. ఈ ఘటనలో ఆమె రహదారిపై పడిపోగా అంతర్గతంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. ప్రమాదం సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న తల్లి, ఇతర కుటుంబ సభ్యులు మృతురాలిని పట్టుకుని రోదించారు. భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని