ఇంట్లోకి చొరబడి మహిళపై కిరాతకం.. గ్యాంగ్‌రేప్‌ చేసి సిగరెట్లతో కాల్చారు!

ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ముగ్గురు దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె ప్రైవేటు భాగాలను సిగరెట్లతో కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated : 04 Dec 2022 21:19 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఆమెపై పదునైన ఆయుధంతో దాడి చేసి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. అంతటితో ఆగకుండా ఆ మహిళ రహస్య భాగాల్లో సిగరెట్‌తో కాల్చినట్లు పోలీసులు గుర్తించారు.

‘ముంబయి కుర్లాలో నివసిస్తోన్న ఓ 42ఏళ్ల మహిళ ఇంట్లోకి బుధవారం ఉదయం ఓ ముగ్గురు దుండగులు ప్రవేశించారు. ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఛాతి, భుజాలపై ఆయుధంతో దాడి చేశారు. అనంతరం బాధితురాలి ప్రైవేటు భాగాలను సిగరెట్లతో కాల్చారు. నిందితుల్లో ఒకడు ఈ ఘటననంతా మొబైల్‌లో చిత్రీకరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ వీడియో వ్యాప్తి చేస్తామని బెదిరించాడు’ అని ముంబయిలోని కుర్లా పోలీసులు వెల్లడించారు.

అయితే, ఆ విషయాన్ని బాధితురాలు తన పొరుగువారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న కుర్లా పోలీసులు.. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు కూడా బాధితురాలు నివాసముండే ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని