మహిళపై సామూహిక అత్యాచారం.. ₹15లక్షలు చోరీ!

ఓ అపార్టుమెంట్‌లోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Updated : 08 Jul 2021 06:33 IST

కోల్‌కతా:  కోల్‌కతాలో దారుణం చోటుచేసుకుంది. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లోకి చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 26 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ ఇంట్లో ఉన్న రూ.15లక్షల నగదు దోచుకెళ్లినట్టు పోలీసులు బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్టు తెలిపారు. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయిందని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. 

ఇది ఆమెకు తెలిసిన వారి పనే అయి ఉంటుందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అత్యాచారం చేసిన అనంతరం ఫ్లాట్‌లో ఉన్న రూ.15లక్షల నగదు ఎత్తుకెళ్లినట్టు పేర్కొన్నారు. గార్డెన్‌ రీచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ బుధవారం ఫిర్యాదు చేశారని, కోల్‌కతా పోలీస్‌ డిటెక్టివ్‌ డిపార్టుమెంట్‌ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. అత్యాచారానికి ముందు మహిళను కట్టేసి ఉంచినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఆ మహిళ ఫ్లాట్‌ నుంచి ఫోరెన్సిక్‌ బృందం శాంపిల్స్‌ను సేకరించిందని,  అలాగే, ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని