Telangana News: జహీరాబాద్‌లో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ శివారులోని డిడిగి గ్రామంలోని 

Updated : 25 Sep 2022 15:54 IST

జహీరాబాద్‌ అర్బన్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ శివారులోని డిడిగి గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో వివాహితపై సామూహిక అత్యాచార జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 24ఏళ్ల వివాహితను గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో జహీరాబాద్ తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహితను సికింద్రాబాద్‌లోని సమీప ప్రాంత వాసిగా గుర్తించారు. ఆటో ఎక్కిన వివాహితకు మత్తుమందు ఇచ్చారా? జహీరాబాద్ ప్రాంతానికి తీసుకొచ్చాక మద్యం తాగించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం రాత్రి కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ నుంచి వివాహితను తీసుకొచ్చి జహీరాబాద్‌లో అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను అక్కడే వదిలి వెళ్లారు. శనివారం ఉదయం అచేతన స్థితిలో పడి ఉన్న ఆమెను స్థానిక వ్యక్తి గుర్తించి జహీరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించారు. వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బాధితురాలిని పోలీసులు సంగారెడ్డిలోని సఖీ కేంద్రానికి తరలించారు. సామూహిక అత్యాచారం ఘటనను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచి దర్యాప్తు చేపట్టడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై మాట్లాడేందుకు జహీరాబాద్ డీఎస్పీ రఘు నిరాకరించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts