Prakasam: అప్పుడే పుట్టిన శిశువును సంచిలో కట్టి.. గిద్దలూరులో అమానుషం!
ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ మహిళ సంచిలో కట్టి వదిలివెళ్లింది.

గిద్దలూరు పట్టణం: కన్న బిడ్డకు గుక్కెడు పాలివ్వలేని ఆర్థిక దైన్యమో లేక అక్రమ సంతానమో తెలియదు గానీ.. పేగు బంధాన్ని మరచి కన్నపేగునే గాలికొదిలేసింది ఓ మాతృమూర్తి. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అప్పుడే పుట్టిన మగ శిశువును ఓ మహిళ సంచిలో కట్టి వదిలివెళ్లింది. సంచిని కార్యాలయం ఆవరణలో ఉన్న పందులు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో శిశువు ఏడుపు విన్న రెవెన్యూ కార్యాలయ ఉద్యోగులు శిశువును కాపాడి.. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి ఆర్‌ఎంవో కె.రమణారెడ్డి తెలిపారు. శిశువును ఎవరు వదిలేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
-
సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం
-
Epuri Somanna: త్వరలో భారాసలోకి ఏపూరి సోమన్న
-
Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు