crime: అత్తను చంపి గోనె సంచిలో కుక్కిన కోడలు

అత్తతో గొడవపడిన కోడలు చివరికి ఆమెను తన ఇంట్లోనే పాశవికంగా హత్య చేసింది. భర్త సాయంతో ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తరలించేందుకు చేసిన ప్రయత్నంలో పొరుగు వ్యక్తి కంటపడి పోలీసులకు దొరికిపోయింది. అత్యంత దారుణమైన ఈ ఘటన పుణె సమీపంలోని తాలెగావ్‌

Published : 25 May 2021 01:26 IST

మృతదేహం తరలింపులో సాయం చేసిన భర్త

 పుణె: అత్తతో గొడవపడిన కోడలు చివరికి ఆమెను తన ఇంట్లోనే పాశవికంగా హత్య చేసింది. భర్త సాయంతో ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తరలించేందుకు చేసిన ప్రయత్నంలో పొరుగు వ్యక్తి కంటపడి పోలీసులకు దొరికిపోయింది. అత్యంత దారుణమైన ఈ ఘటన పుణె సమీపంలోని తాలెగావ్‌ దభడేలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బేబీ గౌతమ్‌ షిండే(50)కుమారుడు మిలింద్‌ గౌతమ్‌ షిండేతో పూజ మిలింద్‌ షిండే(22)కు వివాహం జరిగింది. భార్యభర్తలిద్దరూ ఓ భారీ గోనె సంచిని ఆదివారం ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లడం వారి పొరుగు వ్యక్తి గమనించాడు. వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు.  వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాలనీలోని సీసీ టీవీల్లో రికార్డయిన దృశ్యాలను సేకరించారు. నిందితులిద్దరూ ఓ గోనె సంచిని తమ ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లడం అందులో రికార్డయింది. ఆ తర్వాత సమీపంలోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో మృతదేహాన్ని పోలీసులు గర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి విచారించగా హత్య చేసిన తీరును పోలీసులకు వివరించారు. పూజ, తన అత్తకు మధ్య శుక్రవారం గొడవ జరిగింది. అనంతరం తన అత్త గొంతుకు జాకెట్‌ను గట్టిగా బిగించి పూజ ఆమెను హత్య చేసింది. ఆ తర్వాత దంపతులిద్దరూ కలిసి మృతదేహాన్ని ఓ గోనె సంచిలో కుక్కి ఇంటి మిద్దె పైన ఉంచారు. మృతదేహం నుంచి దర్వాసన వస్తుండటంతో భర్త సాయంతో దానిని అక్కడి నుంచి తరలించి సమీంలోని ఖాళీ స్థలంలో ఉన్న చెట్ల పొదల్లో పడేసినట్లు నిందితురాలు పోలీసులకు వివరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని