Crime News: ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!

Crime News: ఆస్తి తగాదాలు ఓ మహిళ, ఆమె కూతుర్ని గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. ఈ అమానవీయ ఘటన పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ నగరంలో చోటుచేసుకుంది.

Updated : 01 Jul 2024 09:30 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ నగరంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పరాకాష్ఠకు చేరిన ఆస్తి పంపకాల గొడవలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టే వరకు వెళ్లాయి. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని లతిఫాబాద్‌ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోడను బద్దలుకొట్టి బాధితులను రక్షించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వరుసకు బావ అయిన సుహైల్‌ కుమారులతో కలిసి గతకొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆస్తి తగాదాల్లో భాగంగానే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల అవి మరింత ముదరటంతో తనతో పాటు తన కుమార్తెను ఓ గదిలో బంధించి బయట నుంచి గోడ కట్టారని వాపోయింది.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి వారిని రక్షించారు. సుహైల్‌, ఆయన కుమారులపై కేసు నమోదు చేశారు. ఈ దుశ్చర్యకు కారణమైన వారిపై కఠిన సెక్షన్ల కేసు నమోదు చేసి, తగిన శిక్ష పడేలా చేస్తామని స్థానిక పోలీస్ అధికారి ఫరూక్‌ లింజర్‌ తెలిపారు. దీన్ని ఘోరమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. మున్ముందు ఈ ఘటనలు జరగకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని