Crime: మాజీ ప్రియుడిని ఇరికించబోయి.. తను ఇరుక్కుంది!

సాధారణంగా ప్రేమ విషయంలో విబేధాలు తలెత్తితే.. అమ్మాయిలు వేధింపులకు గురవుతుంటారు. కానీ, ఐర్లాండ్‌కి చెందిన ఓ అమ్మాయే అబ్బాయిపై సోషల్‌మీడియా వేదికగా వేధింపులకు పాల్పడింది. అతడిపై నేరారోపణ చేసేందుకు ప్రయత్నించింది. కానీ, వ్యూహం బెడిసికొట్టి ఆమెనే

Published : 16 Jan 2022 03:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ప్రేమ విషయంలో విభేదాలు తలెత్తితే.. అమ్మాయిలు వేధింపులకు గురవుతుంటారు. కానీ, ఐర్లాండ్‌కి చెందిన ఓ అమ్మాయే అబ్బాయిపై సోషల్‌మీడియా వేదికగా వేధింపులకు పాల్పడింది. అతడిపై నేరారోపణ చేసేందుకు ప్రయత్నించింది. కానీ, వ్యూహం బెడిసికొట్టి తనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

20ఏళ్ల కర్టనీ ఎయిన్స్‌వర్త్‌.. తన బాయ్‌ఫ్రెండ్‌ లూయిస్‌ జాలీతో మనస్పర్థలు వచ్చి విడిపోయింది. అయితే, మాజీ ప్రియుడిపై పగ పెంచుకున్న కర్టనీ అతడిని జైలుపాలు చేయాలనుకుంది. ఈ క్రమంలో 30 నకిలీ ఇన్‌స్టా ఖాతాలు సృష్టించి.. తనకు తానే చంపేస్తానంటూ బెదిరింపు సందేశాలు పంపించుకుంది. వాటిని లూయిసే పంపించినట్లుగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లూయిస్‌పై కేసు నమోదు చేశారు. ఈ నేరారోపణతో పాపం.. లూయిస్‌ ఉద్యోగం కోల్పోయాడు. కాగా.. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా అసలు విషయం బయటపడింది. 30 నకిలీ ఖాతాల్లో 17 ఖాతాలు కర్టనీ మెయిల్‌ ఐడీ, ఐపీ అడ్రస్‌తోనే సృష్టించినట్లు తేలింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం 10 నెలలు జైలు శిక్ష విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని