మరో వ్యక్తితో పారిపోయిన వివాహిత.. నగ్నంగా ఊరేగింపు

వివాహమైన ఓ మహిళ మరో వ్యక్తితో పారిపోయింది. వెతికి పట్టుకున్న భర్త.. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించాడు. ఈ ఘటన గుజరాత్‌లోని దహోడ్‌ జిల్లాలో గత నెలలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వైరల్‌ కావడంతో తాజాగా పోలీసులు

Published : 16 Jul 2021 01:43 IST

అహ్మదాబాద్‌: వివాహమైన ఓ మహిళ మరో వ్యక్తితో పారిపోయింది. వెతికి పట్టుకున్న భర్త.. గ్రామ పెద్దలతో కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని దహోడ్‌ జిల్లాలో గత నెలలో చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దహోడ్‌ జిల్లాలో ఓ గిరిజన ప్రాంతానికి చెందిన 23ఏళ్ల వివాహిత గత నెలలో మరో వ్యక్తితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో ఆమె భర్త, గ్రామస్థులు కలిసి పలు చోట్ల గాలించి వారి ఆచూకీ గుర్తించారు. వారిని తిరిగి గ్రామానికి తీసుకొచ్చి జులై 6న పంచాయితీ పెట్టారు. పెళ్లైన తర్వాత మరో వ్యక్తితో పారిపోయినందుకుగానూ శిక్షగా ఆమె భర్త.. కుటుంబసభ్యులు కలిసి మహిళను కొట్టడంతో పాటు వివస్త్రను చేసి ఊరేగించారు. అంతేకాదు.. తన భర్తను భుజాన ఎత్తుకొని నడవాలని గ్రామ పెద్దలు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో స్థానికంగా కలకలం రేపింది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్తతోపాటు మరో 18 మందిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని