Yo Yo Honey Singh: సింగర్‌ యోయో హనీ సింగ్‌పై గృహహింస పిటిషన్‌

బాలీవుడ్‌ సింగర్‌, నటుడు యో యో హనీ సింగ్‌పై దిల్లీ కోర్టులో గృహహింస పిటిషన్‌ దాఖలైంది. హనీ సింగ్‌ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తూ అతడి భార్య శాలిని తల్వార్‌ దిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది.

Published : 04 Aug 2021 01:43 IST

దిల్లీ: బాలీవుడ్‌ సింగర్‌, నటుడు యో యో హనీ సింగ్‌పై దిల్లీ కోర్టులో గృహహింస పిటిషన్‌ దాఖలైంది. హనీ సింగ్‌ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు ఆరోపిస్తూ అతడి భార్య శాలిని తల్వార్‌ దిల్లీలోని తీస్‌ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆయన తనను మోసం చేసినట్టు అందులో పేర్కొంది. ఆమె తరఫున న్యాయవాదులు సందీప్‌ కౌర్‌, అపూర్వ పాండే, జీజీ కశ్యప్ కోర్టుకు హాజరయ్యారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి తానియా సింగ్‌.. హనీసింగ్‌కు నోటీసులు జారీ చేశారు. హనీ సింగ్‌ తనపై వచ్చిన ఆరోపణలకు ఈ నెల 28 లోగా బదులివ్వాల్సిందిగా అందులో పేర్కొన్నారు. తమ ఉమ్మడి ఆస్తులకు సంబంధించి హనీసింగ్‌ ఎలాంటి లావాదేవీలూ జరపకూడదంటూ శాలిని తల్వార్‌కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హనీసింగ్‌ 2014లో ‘ఇండియాస్‌ రా స్టార్‌’ అనే రియాలిటీ షోలో తన భార్య శాలినీ తల్వార్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దీపికా పదుకొణె, సైఫ్‌ అలీఖాన్‌ నటించిన కాక్‌టెయిల్‌ చిత్రంలోని ఓ పాట హనీ సింగ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అతడు ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులకు పనిచేశాడు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని