Warangal: యువకుడి ప్రాణం తీసిన ‘రీల్స్‌’ సరదా

రీల్స్‌ చేసే సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మెడకు ఉరి వేసుకొని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించే క్రమంలో మెడకు తాడు బిగుసుకుపోవడంతో మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Updated : 20 Jun 2024 06:56 IST

ఉరి బిగుసుకుని మృతి

నర్సంపేట, న్యూస్‌టుడే: రీల్స్‌ చేసే సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మెడకు ఉరి వేసుకొని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించే క్రమంలో మెడకు తాడు బిగుసుకుపోవడంతో మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్‌(23) హోటల్‌లో పని చేస్తుంటాడు. మొబైల్‌తో రీల్స్‌ చేసే అలవాటు ఉంది. మంగళవారం రాత్రి మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు. ఉరి వేసుకుంటూ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ని అమర్చి దూలానికి ఉరి వేసుకోబోయాడు. ఈ క్రమంలో ఉరి బిగుసుకొని మృతి చెందాడు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలంలో సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ అజయ్‌ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు