
కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్య
అనంతపురం: అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి పొదుపు డబ్బును అధికారులు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధితుడు నార్పల మండలం గూగూడు వాసి రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.