
Crime news: నన్నెందుకు ప్రేమించవ్?.. యువతిపై ఘాతుకం
నాసిక్: మహారాష్ట్రలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదన్న కోపంతో యువతిని గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో శనివారం చోటుచేకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని నాసిక్‌లోని నిఫడ్ తాలుకా లాసల్‌గాన్‌లో అతడి సోదరి ఇంట్లో అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. శరణ్‌సింగ్ సేథి (20) అనే వ్యక్తి సుఖ్‌ప్రీత్ కౌర్ (18) అనే యువతిని ఔరంగాబాద్ సమీపంలోని దేవగిరి కళాశాల సమీపంలో శనివారం మధ్యాహ్నం గొంతుకోసి చంపాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కళాశాలలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చదువుతున్న యువతిని గొంతుకోసి చంపడానికి ముందు ‘నన్ను ఎందుకు ప్రేమించవు?’ అని ఆమెపై అరిచినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఔరంగాబాద్‌లోని వేదాంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అప్రమత్తమైన నాసిక్ జిల్లా ఎస్పీ సచిన్ పాటిల్ సారథ్యంలోని బృందం నిందితుడిని అతడి సోదరి ఇంట్లో ఆదివారం అదుపులోకి తీసుకుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: విద్యార్థులకు త్వరలో ఉపకార వేతనాలు.. వెంటనే అందించాలని మంత్రి ఆదేశం
-
Sports News
IND vs ENG: ధాటిగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు.. అప్పుడే 50 పరుగులు కొట్టేశారు
-
India News
Agnipath: నేవీలో అగ్నిపథ్ నియామకాలు.. 10వేల మంది మహిళల దరఖాస్తు
-
Politics News
Uddhav Thackeray: తప్పెవరిదో వాళ్లే చెప్తారు.. ప్రజా కోర్టులో తేల్చుకుందాం రండి: ఉద్ధవ్ సవాల్
-
Business News
SSY: సుకన్య సమృద్ధి యోజన ఖాతా గురించి సందేహాలా?.. సమాధానాలివిగో..!
-
General News
CM Jagan: విభజన వల్ల దెబ్బతిన్నాం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి: మోదీకి జగన్ వినతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు