Crime News: ప్రియుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్య .. కంటతడి పెట్టించిన సెల్ఫీవీడియో

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. తనకు అన్యాయం జరిగిందంటూ బాధితురాలు పురుగుల మందు సేవిస్తూ రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో బయటికి వచ్చింది. 

Published : 08 Oct 2022 01:41 IST

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. తనకు అన్యాయం జరిగిందంటూ బాధితురాలు పురుగుల మందు సేవిస్తూ రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో బయటికి వచ్చింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ కు చెందిన తేజశ్రీ.... నెన్నెల మండలం లంబాడితండాకు చెందిన ధరావత్  రాజ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని ఇంటి నుంచి తీసుకువెళ్లిన రాజ్ కుమార్ ... ఆమెను ఓ చోట ఉంచి, పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలో.. రాజ్ కుమార్  తప్పించుకుని తిరుగుతుండటంతో మోసపోయానని యువతి గ్రహించింది. మనస్తాపంతో పురుగుల మందు సేవించి.. ఆటోలో లంబాడితండాకు వెళ్తుండగా, మార్గమధ్యలో స్పృహకోల్పోయింది. గమనించిన డ్రైవర్ తేజశ్రీని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. రాజ్ కుమార్ ను నమ్మి అందరినీ వదిలేసి వచ్చానని...ఇప్పుడు నాకు దిక్కెవరంటూ తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో ద్వారా చెప్పిన మాటలు.. చూసిన వారిని కంటతడిపెట్టించాయి.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని