Andhra News: రైలు, ప్లాట్‌ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన విద్యార్థిని మృతి
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ(20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందింది. యూరిన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం అవుతుండటంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
కూర్మన్నపాలెం: విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ(20) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. యూరిన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం అవుతుండటంతో ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో మృత్యువుతో పోరాడుతూ శశికళ ప్రాణాలు విడిచింది.
అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (Guntur Rayagada Express)లో ఆమె దువ్వాడ చేరుకుంది. స్టేషన్‌లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ప్లాట్‌ఫామ్ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల వద్ద ఉండిపోవడంతో తీవ్ర గాయాలతో గగ్గోలు పెట్టింది. దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కున్న చోట ప్లాట్‌ఫామ్‌ను కట్ చేశారు. గంటన్నర పాటు శ్రమించి ఆమెను బయటకు తీశారు. అనంతరం చికిత్స నిమిత్తం షీలా నగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. యూరిన్ బ్లాడర్ దెబ్బతిని రక్తస్రావం అవుతుండటంతో ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. ప్లాట్‌ఫామ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఇతర అవయవాలు కూడా దెబ్బతినడంతో శశికళ కోలుకోలేక మృతిచెందింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు