
Updated : 16 Jan 2022 12:48 IST
Crime News: నల్గొండలో దారుణం.. అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి
దేవరకొండ: నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం చోటుచేసుకుంది. అన్నపై తమ్ముడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకునేందుకు వచ్చిన అన్న కుమార్తెను కూడా గొడ్డలితో నరికేశాడు. జిల్లాలోని దేవరకొండ మండలం కొండ భీమనపల్లిలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అన్నాతమ్ముళ్ల భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి ఏదో విషయంలో వారి మధ్య గొడవ జరగడంతో.. కోపంతో అన్న.. అన్న కుమార్తెపై తమ్ముడు మల్లేశం దాడి చేశాడు. దాడిలో గాయపడిన వారిని దేవరకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Tags :