Hyderabad: అమీర్‌పేటలో తుపాకీతో యువకుడు హల్‌చల్‌

హైదరాబాద్‌లోని అమీర్‌పేట బిగ్‌బజార్‌ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్‌ సృష్టించాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 09 Nov 2022 11:47 IST

పంజాగుట్ట: హైదరాబాద్‌లోని అమీర్‌పేట బిగ్‌బజార్‌ వద్ద ఓ యువకుడు తుపాకీతో హల్‌చల్‌ సృష్టించాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. సాయికుమార్‌ అనే యువకుడు గన్‌ చూపిస్తూ రోడ్డుపై వెళ్లే పాదచారులు, వాహనదారులను బెదరగొట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని యువకుడిని స్టేషన్‌కు తరలించారు. అతడి నుంచి ఆరు బులెట్లు స్వాధీనం చేసుకున్నామని.. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ హరిశ్చాంద్రారెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని