IDA Bollaram: కాళ్లూ చేతులు కట్టేసి.. తలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టి చంపేశారు!

జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

Updated : 13 Oct 2022 09:57 IST

జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రింగురోడ్డు సర్వీసు రహదారిపై గుర్తుతెలియని యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి తలకు ప్లాస్టిక్‌ కవర్‌ను చుట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున యువకుడి హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

ఇతర ప్రాంతాల్లో హతమార్చి ఇక్కడికి తెచ్చారా? ఇక్కడే హత్య చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెప్పారు. క్లూస్‌ టీం ను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నామని ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. ప్రేమ వ్యవహారం లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువకుడు వయసు 30 ఏళ్లలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని