Hyderabad: రాజేశ్‌ది హత్యేనా? ప్రభుత్వ టీచర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?

నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పెద్ద అంబర్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువకుడు రాజేశ్‌ మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.

Updated : 30 May 2023 16:54 IST

హైదరాబాద్‌: నగర శివారు పెద్ద అంబర్‌పేట్‌లో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పెద్ద అంబర్‌పేట్‌ డాక్టర్స్‌ కాలనీ సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో యువకుడు రాజేశ్‌ మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త నాగేశ్వరరావే రాజేశ్‌ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. టీచర్‌ భర్తతో పాటు మరికొంతమంది బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

రాజేశ్‌ హత్య కేసుతో తనకు సంబంధం లేదని ప్రభుత్వ టీచర్‌ భర్త నాగేశ్వరరావు చెబుతున్నారు. అతడిపై దాడి చేశామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అసలు రాజేశ్‌ ఎవరో తమకు తెలియదని.. తన భార్యను ఎవరో బ్లాక్‌ మెయిల్‌ చేసి భయపెట్టారని చెప్పారు. ఆమెకు రాజేశ్‌తో సోషల్‌ మీడియాలో పరిచయం జరిగి ఉండొచ్చని.. వాళ్లిద్దరికీ వయసులోనూ చాలా వ్యత్యాసం ఉందన్నారు. తన భార్య మృతిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని నాగేశ్వరరావు కోరారు. 

నేపథ్యమిదీ..

హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో రాజేశ్‌కు కొంతకాలంగా ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి బంధం గురించి భర్తకు తెలియడంతో ఆమెను పలుమార్లు మందలించారు. మనస్తాపానికి గురైన ఆమె.. తాను చనిపోతానంటూ రాజేష్‌తో జరిపిన వాట్సప్‌ చాటింగ్‌లో చెప్పింది. అలా చేయొద్దని.. తానూ చనిపోతానని రాజేశ్‌ చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈనెల 24న పురుగుల మందు తాగి టీచర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం ఆమెను నగరంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కాగా ఈనెల 24 నుంచీ రాజేశ్‌ సదరు మహిళ  ఇంటి చుట్టూ తిరుగుతుండగా.. ఆమె కుమారుడు గమనించాడు. తన స్నేహితులతో కలిసి ఈనెల 26న రాజేశ్‌ను పట్టుకొని నిలదీసి.. అతడి సెల్‌ఫోన్‌ పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో వారు రాజేశ్‌ను కొట్టి హెచ్చరించి వదిలేసినట్లు తెలిసింది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని