Hyderabad: మాదాపూర్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

నగరంలోని మాదాపూర్‌లో సాయి అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అయ్యప్ప సొసైటీలోని ఓ హోటల్‌ ఆరో అంతస్తు పైనుంచి పడి మరణించాడు.

Updated : 17 Jun 2024 10:01 IST

హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో సాయి అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అయ్యప్ప సొసైటీలోని ఓ హోటల్‌ ఆరో అంతస్తు పైనుంచి పడి మరణించాడు. మృతుడిని అనంతపురం జిల్లా వాసిగా గుర్తించారు. సాయి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఇటీవల ప్రిలిమ్స్‌కు అర్హత సాధించడంతో మెయిన్స్‌కు సిద్ధమవుతున్నాడు. హోటల్‌ గదిలో సాయి స్నేహితులు నలుగురు ఉన్నట్లు సమాచారం. అతడిది ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని