- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Hyderabad: బాలికతో పెళ్లి చేయట్లేదని.. డీజిల్ పోసుకొని సజీవదహనం
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. ప్రేమించిన బాలికను ఇచ్చి పెళ్లి చేయడం లేదని ఆమె ఇంటి ముందు ఒంటిపై డీజిల్ పోసుకుని జమాల్ అనే యువకుడు సజీవదహనం అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోలని చష్మా ప్రాంతానికి చెందిన జమాల్ అనే యువకుడు తీగలకుంట ప్రాంతంలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉండే మైనర్ బాలికను ప్రేమించాడు. ఆమెను ఇచ్చి వివాహం చేయాలని కొద్ది రోజులుగా కోరుతున్నాడు. దీంతో బాలిక తండ్రి అతడిని మందలించాడు. పెళ్లికి నిరాకరిస్తే చనిపోతానని యువకుడు బెదిరించాడు.
శనివారం రాత్రి డీజిల్ క్యాన్‌తో బాలిక ఇంటికి వెళ్లిన జమాల్ పెళ్లి చేయాల్సిందిగా మరోసారి కోరాడు. యువకుడు డీజిల్‌తో రావడంతో భయపడిన బాలిక కుటుంబసభ్యులు లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఆ వెంటనే తనపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు వ్యాపించి తీవ్రగాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు మంటలార్పి ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. తన కుమార్తెను ప్రేమించినందుకే ఇంటికి పిలిచి హత్య చేశారని యువకుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Khammam: కార్యకర్తలు సంయమనం పాటించాలి.. కృష్ణయ్య హత్య ఘటనపై తుమ్మల దిగ్ర్భాంతి
-
Sports News
MS Dhoni : ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే రెండేళ్లు.. మరోసారి వైరల్‌గా మారిన రిటైర్మెంట్ ‘టైమ్’
-
Viral-videos News
Viral Video: ఇద్దరు వైద్యుల డ్యాన్స్.. ఇప్పుడు నెట్టింట హల్చల్
-
General News
Chandrababu: విజన్-2047.. చంద్రబాబు చేసిన 10 సూచనలివే!
-
Movies News
Telugu movies: ఈ వారం వచ్చేవన్నీ చిన్న చిత్రాలే..! మరి ఓటీటీ మాటేంటి?
-
India News
Flight: గర్ల్‌ఫ్రెండ్‌తో చాటింగ్.. ఆరు గంటలు ఆగిపోయిన విమానం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Puri Jagannadh: విజయ్ దేవరకొండ రూ.2 కోట్లు వెనక్కి పంపించేశాడు: పూరీ జగన్నాథ్
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Flag Hoisting: కరుణానిధి చొరవతో సీఎంల జెండావందనం!