Honey trap: యూట్యూబర్ హనీట్రాప్.. రేప్ కేసులో ఇరికిస్తానని బెదిరించి ₹80లక్షలు దోపిడీ!
‘నువ్వంటే ఇష్టం.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా..’ అని ఓ యువ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఓ మహిళను గురుగ్రామ్(Gurugram) పోలీసులు అరెస్టు చేశారు. హనీట్రాప్(Honey-trap)కు పాల్పడి అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి అతడి నుంచి ఏకంగా రూ.80లక్షలకు పైగా దోపిడీకి పాల్పడిన ఆరోపణలపై నమ్రా ఖదీర్ అనే మహిళను నిన్న అదుపులోకి తీసుకున్నట్టు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు.
గురుగ్రామ్: ‘నువ్వంటే ఇష్టం.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా..’ అని ఓ యువ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఓ మహిళను గురుగ్రామ్(Gurugram) పోలీసులు అరెస్టు చేశారు. హనీట్రాప్(Honey-trap)కు పాల్పడి అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి అతడి నుంచి ఏకంగా రూ.80లక్షలకు పైగా దోపిడీకి పాల్పడిన ఆరోపణలపై నమ్రా ఖదీర్ అనే మహిళను నిన్న అదుపులోకి తీసుకున్నట్టు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరిచి నాలుగు రోజుల రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న ఆమె భర్త మనీశ్ అలియాస్ విరాట్ బేనీవాల్ పరారీలో ఉన్నాడని.. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆగస్టులోనే వీరిపై కేసు నమోదైనప్పటికీ ఈ దంపతులిద్దరూ మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారని.. ఆ బెయిల్ రద్దయిన తర్వాత నవంబర్ 26న సెక్టార్-50 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఆమెను అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు.
ఎలా ట్రాప్ చేసిందంటే..
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమ్రా ఖదీర్ (22) అనే మహిళ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఆ ఛానల్‌కు దాదాపు 6 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే దిల్లీలోని బాద్షాపూర్లో అడ్వర్టయిజింగ్ సంస్థను నడుపుతున్న దినేశ్ యాదవ్ (21) అనే యువకుడికి కొన్నాళ్ల క్రితం నమ్రా, ఆమె భర్త బేనీవాల్‌తో పరిచయం ఏర్పడింది. వారి యూట్యూబ్ ఛానల్లో తమ సంస్థను ప్రమోట్ చేయాలని అతడు కోరగా.. అందుకు రూ.2లక్షలు అడిగారు. దీంతో ఆ మొత్తాన్ని ఆయన చెల్లించారు. అలా కొన్నాళ్లకు నమ్రా ఖదీర్ అతడి పట్ల ఇష్టాన్ని తెలిపి.. పెళ్లి చేసుకోవాలనుకొంటున్నట్టు చెప్పింది. ఆ తర్వాత వారి మధ్య స్నేహం కొనసాగింది. అయితే, ఆగస్టులో నమ్రా ఖదీర్, బేనీవాల్‌తో కలిసి బాధితుడు ఓ క్లబ్లో పార్టీకి వెళ్లగా.. రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే రూమ్ బుక్ చేసుకొని ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం దినేశ్ నిద్ర లేచే సరికి నమ్రా అతడి బ్యాంకు కార్డులు, వాచ్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే అత్యాచారం కేసులో ఇరికిస్తానంటూ బెదిరించింది. అలా మొత్తంగా బాధితుడి నుంచి దాదాపు రూ. 80లక్షలు, విలువైన కానుకలు దోచుకుంది. ఆ తర్వాత జరిగిన విషయాన్నంతా తన తండ్రికి చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్టు బాధితుడు దినేశ్ యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడని పోలీసులు వివరించారు.
నేరాన్ని ఆమె అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడి నుంచి ఆమె దోచుకున్న డబ్బు, ఇతర వస్తువుల్ని రికవరీ చేసేందుకు నమ్రాను రిమాండ్‌లోకి తీసుకున్నట్టు చెప్పారు. ఈ కేసులో సహ నిందితుడైన ఆమె భర్త బేనీవాల్‌ను త్వరలోనే అరెస్టు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ