Youtuber: యూట్యూబర్‌ బుర్రలో బూతు పురుగు!

అతడో యూట్యూబర్‌. స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. అమెరికాలో ఉంటున్న ప్రణీత్‌ హనుమంతు ఓ వీడియోలో..

Updated : 09 Jul 2024 07:35 IST

తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర మాటలు
దేశవ్యాప్తంగా దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తు షురూ

ఈనాడు, హైదరాబాద్‌: అతడో యూట్యూబర్‌. స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. అమెరికాలో ఉంటున్న ప్రణీత్‌ హనుమంతు ఓ వీడియోలో.. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్‌ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిధరమ్‌తేజ్‌ ఎక్స్‌ వేదికగా ఆదివారం స్పందించారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులతోపాటు మరికొందరికి ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తాజాగా దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారిలో ఒకరైన ప్రణీత్‌ అమెరికాలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. దారుణ వ్యాఖ్యలు చేసిన ప్రణీత్‌ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పారు.

అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు: మంత్రి సీతక్క

సోషల్‌ మీడియాలో ఓ చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనపై శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని కొందరు అసభ్యంగా వక్రీకరించడం దారుణమన్నారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని