Praneet: సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు.. యూట్యూబర్‌ ప్రణీత్‌ అరెస్ట్‌

స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

Updated : 10 Jul 2024 20:18 IST

హైదరాబాద్‌: స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోయిన యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడాడు. ఓ వీడియోలో.. తండ్రి, కుమార్తె బంధంలో అశ్లీలం ధ్వనించేలా మిత్రులతో చిట్‌చాట్‌ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇంత దారుణంగా వీడియోలు చేయడంపై సినీ నటుడు సాయిదుర్గ తేజ్‌ ఎక్స్‌ వేదికగా ఆదివారం స్పందించారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులతోపాటు మరికొందరికి ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కేసు నమోదు చేసిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

బుధవారం బెంగళూరులో ప్రణీత్‌ను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని స్థానిక కోర్టులో హాజరుపర్చారు. తండ్రి కుమార్తెల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని అభియోగంతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌ నమోదైంది. పరారీలో ఉన్న మరి కొంత మంది కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రణీత్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌ తీసుకొస్తున్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని