YouTuber Praneeth: బూతు యూట్యూబర్‌ బెంగళూరులో అరెస్ట్‌!

మంచీచెడుల విచక్షణ మరచి తండ్రి, కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూతు యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు(29)ను బుధవారం బెంగళూరులో అరెస్టు చేసినట్లు టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపారు.

Published : 11 Jul 2024 02:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: మంచీచెడుల విచక్షణ మరచి తండ్రి, కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూతు యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతు(29)ను బుధవారం బెంగళూరులో అరెస్టు చేసినట్లు టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌ తెలిపారు. ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా హనుమంతు, అతడి మిత్రులు వీడియో చాటింగ్‌లో మాట్లాడుకున్నారు. ఇంట్లోకి వచ్చిన తండ్రి వద్దకు అమాయకంగా వెళ్లిన చిన్నారిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. తండ్రీకూతుళ్ల బంధాన్ని కించపరిచేలా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. వారిలో ఏ ఒక్కరూ దీన్ని తప్పని వారించకపోగా వికృతంగా నవ్వుతూ తమ నీచబుద్ధిని ప్రదర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన ఈ వీడియోపై సినీ నటుడు సాయిదుర్గాతేజ్‌ ఎక్స్‌ ద్వారా తీవ్రంగా స్పందించారు. ఈ వీడియోను ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు పలువురు అధికారులకు ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నిందితులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో ఈ నెల 7న టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు హనుమంతు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై అరెస్టు చేసి నగరానికి తీసుకొస్తున్నారు. మిగిలినవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు