ఆ కుటుంబం మొదటి నుంచీ వివేకాకు వ్యతిరేకమే!: సీబీఐకి వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో ఎంపీ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన

Updated : 25 Feb 2022 12:34 IST

పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో ఎంపీ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. 2021 ఆగస్టు 16న సీబీఐకి ఆయన తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. దాని ప్రకారం..‘‘వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు వైఎస్‌ మనోహర్‌రెడ్డి చెప్పారు. వివేకా బెడ్, నేలపై రక్తపు మరకలు చూశాను. బెడ్‌రూమ్‌లో దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా ఉన్నారు. బాత్‌రూమ్‌లో రక్తపు మరకల మధ్య మృతదేహం ఉంది. మృతదేహం చూశాక అది గుండెపోటు కాదని గ్రహించాను.

వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి చెప్పారు. సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపేస్తున్నారని సీఐ అడిగినా పట్టించుకోలేదు. పనిమనిషితో రక్తపు మరకలు శుభ్రం చేయిస్తుంటే అనుమానం వచ్చింది. రక్తపు మరకలను శంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి శుభ్రం చేయించారు. కడప ఎంపీ టికెట్‌ తనకు ఇవ్వకున్నా పర్లేదని వివేకా చెప్పారు. తనను కాదంటే టికెట్‌ను షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని ఆయన కోరారు. భాస్కర్‌రెడ్డి కుటుంబం మొదట్నుంచీ వివేకాకు వ్యతిరేకంగా ఉండేది’’ అని వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి ఆ వాంగ్మూలంలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని