viveka murder case: రంగన్న వాంగ్మూలం తీసుకుని బస్టాండ్‌లో వదిలేశారు

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 47 రోజులుగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు కీలక ముందడుగు వేశారు. వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న

Published : 24 Jul 2021 00:30 IST

పులివెందుల: మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 47 రోజులుగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు కీలక ముందడుగు వేశారు. వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న వాంగ్మూలాన్ని జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేయించారు. కడప నుంచి రంగన్నను తీసుకుని జమ్మలమడుగు వెళ్లిన సీబీఐ అధికారులు రంగన్న వాంగ్మూలం నమోదు చేశారు. సెక్షన్‌ 164 కింద రంగన్న వాంగ్మూలాన్ని  మేజిస్ట్రేట్‌ ఫక్రూద్దీన్‌ రికార్డు చేశారు. అనంతరం సీబీఐ అధికారులు రంగన్నను పులివెందుల బస్టాండ్‌లో వదిలి వెళ్లారు. అక్కడి నుంచి వాచ్‌మెన్‌ రంగన్న నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. కీలక కేసులో సాక్షులకు కల్పించే భద్రత ఇదేనా అంటూ అధికారుల తీరుపై పలువురు విమర్శలు గుప్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని