
Andhra News: పులివెందుల వైకాపా నేత వైఎస్ కొండారెడ్డి అరెస్ట్
పులివెందుల: సీఎం జగన్ సమీప బంధువు, పులివెందుల నియోజకవర్గం పరిధిలోని చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పులివెందుల- రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ సంస్థ కాంట్రాక్టర్‌ను కొండారెడ్డి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. చక్రాయపేట మండలంలో పనులు చేయాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఓ భాజపా నేతకు చెందిన ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ సంస్థ.. కొండారెడ్డి బెదిరిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన జగన్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అనంతరం కొండారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతని కాల్‌డేటాను పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు గుర్తించారు. నిందితుడిని ఈ ఉదయం 11గంటల ప్రాంతంలో అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కోర్టు రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించినట్లు ఆయన వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Crime News
NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
-
General News
Kiren Rijiju: ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?
-
Movies News
Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
-
General News
Goats milk: మేక పాలతో మేలెంతో తెలుసా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- NTR Fan Janardhan: జూ.ఎన్టీఆర్ వీరాభిమాని జనార్దన్ కన్నుమూత