Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి

వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నేలటూరు గ్రామ సచివాలయ సర్వేయర్‌పై అధికార పార్టీ కార్యకర్త దాడి చేశాడు.

Published : 28 Sep 2023 19:13 IST

బ్రహ్మంగారిమఠం: వైఎస్సార్‌ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నేలటూరు గ్రామ సచివాలయ సర్వేయర్‌పై అధికార పార్టీ కార్యకర్త దాడి చేశాడు. సచివాలయంలోకి వచ్చిన వైకాపా కార్యకర్త నాగమల్లేశ్వర్‌రెడ్డి అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. కార్యాలయంలో సర్వేయర్‌ సునీల్‌ వర్కు చేసుకుంటుండగా.. కార్యాలయ భవనం పైకి వెళ్లి పిచ్చాపాటిగా మాట్లాడుకోవాలని మరో వ్యక్తిని వెంటబెట్టుకొని వచ్చాడు. ఈరోజు సెలవు.. కార్యాలయంలోకి రావొద్దని సునీల్‌ వారించడంతో నాగమల్లేశ్వర్‌రెడ్డి ఆగ్రహించాడు. ‘మా గ్రామంలోని కార్యాలయంలోకి మా ఇష్టానుసారం వస్తాం. నువ్వెవరు చెప్పేదానికి’ అంటూ సర్వేయర్‌ సునీల్‌పై దాడికి దిగాడు. ఈ ఘటనలో సునీల్‌ తలకు గాయమైంది. ఈ విషయంపై బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేసి, ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేసినట్టు బాధితుడు సునీల్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని