Kurnool: బాలికతో అసభ్య ప్రవర్తన.. వైకాపా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌

వైకాపాకు చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 04 Jul 2024 16:40 IST

కోడుమూరు: వైకాపాకు చెందిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ ఘటనపై ఇటీవల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు కర్నూలులోని నివాసంలో ఉండగా రెండో పట్టణ పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అనంతరం వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సుధాకర్‌ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని