logo

కత్తిపోట్ల కలకలం

నగరంలో కత్తుల దాడులు కలకలం రేపాయి. చిలకలగూడ, బేగంపేట్‌ ఠాణాల పరిధుల్లో జరిగిన ఈ ఘటనల్లో 10 మందిని అరెస్ట్‌ చేశారు. అదనపు సీపీ చౌహాన్‌ ఆదివారం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ

Published : 24 Jan 2022 01:42 IST

వేర్వేరు ఘటనల్లో ఇద్దరిపై దాడి, 10 మంది అరెస్టు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: నగరంలో కత్తుల దాడులు కలకలం రేపాయి. చిలకలగూడ, బేగంపేట్‌ ఠాణాల పరిధుల్లో జరిగిన ఈ ఘటనల్లో 10 మందిని అరెస్ట్‌ చేశారు. అదనపు సీపీ చౌహాన్‌ ఆదివారం డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు రమేష్‌, నరేష్‌రెడ్డిలతో కలిసి వివరాలు వెల్లడించారు. అడిక్‌మెట్‌ న్యూబాలాజీనగర్‌లో ఉండే మహమ్మద్‌ నవాజ్‌(22), వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన షేక్‌ సాబెర్‌(23), షరీఫ్‌ఖాన్‌(20) స్నేహితులు. నవాజ్‌ పాతనేరస్థుడు. మేడ్చల్‌ జిల్లా రాంపల్లి కీసరలో ఉండే మణిపాడి సంతోష్‌కుమార్‌ నాలుగేళ్ల క్రితం అతను అంబర్‌నగర్‌లో ఉన్న సమయంలో ఇతరులతో గొడవపడుతున్నాడని నవాజ్‌ను మందలించాడు. అప్పటినుంచి కోపం పెంచుకున్న నవాజ్‌.. సంతోష్‌ ఎదురుపడినప్పుడల్లా అసభ్యంగా దూషించేవాడు. శనివారం రాత్రి 9.30సమయంలో సంతోష్‌ తన స్నేహితులతో కలిసి అంబర్‌నగర్‌లో ఉండగా, ఆటోలో వస్తున్న నవాజ్‌ అతడి ముందు నుంచి ర్యాష్‌గా వెళ్లాడు. 12.30 ప్రాంతంలో సంతోష్‌ తిరిగివెళ్తుండగా..ఓ మెడికల్‌హాల్‌ వద్ద షేక్‌సాబెర్‌, షరీఫ్‌ఖాన్‌లతో కలిసి ఉన్న నవాజ్‌ అతనితో గొడవపడి కత్తితో పొడిచాడు. పోలీసులు బాధితుణ్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

బస్తీల్లో తిరుగుతున్నారంటూ గొడవ

రసూల్‌పురా ఉప్పలమ్మ గుడి ప్రాంతానికి చెందిన వేలూరు ప్రదీప్‌కుమార్‌ కాకాగూడలో ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారుజామున తన మిత్రులు హేమంత్‌కుమార్‌ తదితరులతో కలిసి రసూల్‌పురాకు వచ్చి రామలింగేశ్వరస్వామి గుడి వద్ద స్నేహితుడికి కోసం వేచి ఉన్నాడు. మహ్మద్‌, ఒమర్‌, ఖాజాబహౌద్దీన్‌ హమీద్‌ ఇక్కడికి ఎందుకొచ్చారని మందలించి పంపారు. స్నేహితులు వెళ్లిపోగా..ప్రదీప్‌, హేమంత్‌ బైక్‌పై తిరిగి శాంతమ్మ హోటల్‌ మీదుగా అన్నానగర్‌ వైపు వెళ్తుండగా 3.45 గంటల ప్రాంతంలో ఒమర్‌ వారితో వాగ్వాదానికి దిగాడు. మరో ఆరుగురితో కలిసి ఖాజాబహౌద్దీన్‌ కత్తితో ప్రదీప్‌ను కడుపులో పొడిచాడు. హేమంత్‌ను కొట్టారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రసూల్‌పురాకు చెందిన డ్రైవర్లు ఖాజా బహౌద్దీన్‌(26), మహమ్మద్‌ ఒమర్‌(28), అబ్దుల్‌సమీ(20), మహ్మద్‌ కరీం(19), మహమ్మద్‌ షోయబ్‌(19), దాసర్వాడ్‌ కృష్ణ(21), సయ్యద్‌ సమీర్‌(22)లను రిమాండుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని