logo

రాజ్యాధికారం దిశగా అడుగులు వేద్దాం: జాజుల

బడుగు బలహీన వర్గాల జాతులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని సాగర్‌రింగ్‌

Published : 24 Jan 2022 01:42 IST

కాలమానిని ఆవిష్కరణలో జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

కర్మన్‌ఘాట్‌, న్యూస్‌టుడే: బడుగు బలహీన వర్గాల జాతులు ఐక్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని సాగర్‌రింగ్‌ రోడ్డులోని కేకే గార్డెన్‌లో ఆదివారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. సమాజానికి దిక్సూచిగా నిలిచిన కమ్మర, కుమ్మర, వడ్రంగి కులాలు నేడు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ఆయా కులాలకు ప్రభుత్వాల నుంచి ప్రత్యేక రుణాలు అందజేసి ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పోరాటంతోనే హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమాచారి మాట్లాడుతూ.. కమ్మరి, వడ్రంగి కులస్థులకు ప్రభుత్వం రూ. 5 వేల పింఛన్‌ అందజేయాలని పేర్కొన్నారు.  సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుపుకోవడానికి నగరంలో పదెకరాల స్థలాన్ని కేటాయించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం కాలమానిని ఆవిష్కరించారు.  విష్ణుచారి, శ్రీరాములు చారి, బాలాచారి, సత్యనారాయణచారి, తెరాస హస్తినాపురం డివిజన్‌ అధ్యక్షులు అందోజు సత్యంచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని