logo
Published : 02/12/2021 03:08 IST

తెదేపాకు ఓటేశామని క్వారీలోకి రావద్దంటున్నారు


తెల్లరాయి క్వారీ వద్ద బైఠాయించిన కార్మికులు

దాచేపల్లి, న్యూస్‌టుడే: దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపాకు ఓటేశామనే కారణంతో తెల్లరాయి క్వారీలో రోజువారీ పనుల్లోకి రావద్దని వైకాపాకు చెందిన వారు అడ్డుకున్నారని వడ్డెర కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం నడికూడి తెల్లరాయి క్వారీలో చోటుచేసుకున్న పరిణామాలపై బాధిత వడ్డెర కార్మికులు బుధవారం మాట్లాడారు. వడ్డెర లేబరు కాంట్రాక్టు సొసైటీ పేరుతో వందలాది మంది కార్మికులు దశాబ్దాల నుంచి క్వారీలో తెల్లరాయిని కొట్టుకొని జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ సొసైటీలో సభ్యులు మారుతూ క్వారీని నిర్వహిస్తుంటారు. పార్టీల పేరుతో విభేదాలు ఉన్నా ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా కొంతకాలం క్వారీలో పనులు నిలిచాయి. ఎన్నికల్లో ఎవరి పార్టీకి వారు ఓటేసుకున్నారు. ఈ క్రమంలో 12వ వార్డులో పోటీ చేసిన తెదేపా అభ్యర్థి తరఫున ప్రచారం చేసి ఓట్లేశామని కొన్ని రోజులుగా దాదాపు 60 కుటుంబాలకు చెందిన కార్మికులను పనుల్లోకి వైకాపా శ్రేణులు రానీయడం లేదు. తాడో పేడో తేల్చుకుందామని 1.70 ఎకరాల క్వారీ దగ్గరకు బుధవారం వంద మంది కార్మికులు వెళ్తే ఆ క్వారీ నిర్వాహకుల (వైకాపా) మనుషులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారంతా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. వైకాపా నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్వారీలో పనులు చూపించి ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. గతేడాది కార్మికులకు చెల్లించాల్సిన రూ.12 లక్షల బకాయిలను కూడా తక్షణమే ఇవ్వాలని కోరారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. వడ్డెర కార్మిక నేత బండారు పెదవీరయ్యతో పాటు కార్మికులు పలువురు పాల్గొన్నారు.

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని