logo
Published : 02/12/2021 03:08 IST

వ్యక్తి చావుకు కారకులైనపదిమందిపై కేసు

శావల్యాపురం, న్యూస్‌టుడే: వ్యక్తి చావుకు కారణమైన పదిమందిపై కేసు నమోదైంది. ఎస్సై లేళ్ల లోకేశ్వరరావు కథనం ప్రకారం.. కారుమంచిలోని జెండా చెట్టు వద్ద 15ఏళ్ల నుంచి పుసులూరి చిన్న మస్తాన్‌రావు బడ్డీ కొట్టుపెట్టుకుని జీవిస్తున్నాడు. తెదేపా ప్రభుత్వ హయాంలో బడ్డీ కొట్టు ఉన్న స్థలం ప్రభుత్వానిదని, ఆ ప్రదేశంలో శుద్ధజల పథకం ఏర్పాటు చేయాలని తీయించారు. అనంతరం అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. దీంతో చిన్న మస్తాన్‌రావు అక్కడే ఓ ఇంటి స్థలాన్ని అద్దెకు తీసుకుని బంకు నిర్వహిస్తున్నాడు. సదరు స్థలాన్ని గ్రామానికి చెందిన మన్నం శ్రీనివాసరావు కొనుగోలు చేసి బంకును తీయాలని కోరాడు. అక్కడ కూడా బంకు తీసివేయడంతో మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 12న చిన్నమస్తాన్‌రావు గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇందుకు మన్నం శ్రీనివాసరావు, మాదాల చిరంజీవి, బిక్కి అజిత్‌, ఇడుపులపాటి ఎర్రయ్య, ఇడుపులపాటి యోగయ్య, మాదాల హనుమంతరావు, సోమేపల్లి గోవర్దన్‌, మాదాల అన్నపూర్ణమ్మ, సోమేపల్లి లక్ష్మీ, ఇడుపులపాటి పద్మావతిపై మృతుని భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని