logo
Published : 02/12/2021 03:08 IST

తీర ప్రాంత విపత్తులపై సమీక్ష


అధికారులతో మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్‌

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: కోస్తా సముద్రతీరం వెంబడి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు తీసుకునే చర్యలపై జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో బుధవారం కోస్తా సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ మెరైన్‌ పోలీసులు, మత్స్య శాఖ, కోస్ట్‌గార్డు, కస్టమ్స్‌, ఐబీ శాఖల అధికారులతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సూర్యలంక, నిజాంపట్నం, పండరీపురం బీచ్‌ల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ప్రతి నెలలో మండల స్థాయిలో తీరప్రాంతాల అభివృద్ధి, మత్స్యకారుల సంరక్షణకు ప్రభుత్వ చర్యలపై సమావేశం నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా నియంత్రణ, సముద్ర తీరంలో అక్రమంగా ప్రవేశించడం, దొంగతనాలు, మెరైన్‌ పోలీసుల నిఘా, స్పీడ్‌ బోట్ల పర్యవేక్షణ వంటి అంశాలపై జేసీ చర్చించారు. సమావేశంలో మెరైన్‌ కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసు శాఖ అడిషనల్‌ ఎస్పీ విమలకుమారి, డీఎస్పీ శ్రీనివాసరావు, కస్టమ్స్‌ శాఖ అధికారి శ్రీనివాసన్‌, మత్స్య శాఖ జేడీ సుందరరామిరెడ్డి, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శర్మ, మెరైన్‌ కోస్ట్‌ గార్డు సీఐ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని