logo
Published : 02/12/2021 03:08 IST

చెంతనే చేపల దుకాణాలు

 ఫిష్‌ ఆంధ్రా పేరుతో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు 
 ఒక్కోచోట రూ.5.48 కోట్లతో ఐదు ఆక్వా హబ్‌లు

ఈనాడు, గుంటూరు తాజా చేపలు, రొయ్యలు అందుబాటులో ఉంచడంతోపాటు సగటు వినియోగం పెంచడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ‘ఫిష్‌ ఆంధ్రా’ బ్రాండ్‌ పేరుతో ఆక్వా ఉత్పత్తులను ప్రజలకు అందించనున్నారు. జిల్లాలో గుంటూరు, తెనాలి, పిడుగురాళ్ల, మంగళగిరి, వినుకొండ, నరసరావుపేటలో ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేస్తారు. జనవరి 26 నాటికి గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఏర్పాటు చేసి కనీసం 50 రిటైల్‌ దుకాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆక్వా ఉత్పత్తులు సరఫరా చేయడమే లక్ష్యం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యాపారులు, ప్రైవేటు వ్యక్తులు చేపట్టగా మత్స్యశాఖ పర్యవేక్షిస్తుంది. జిల్లాలో సముద్రంలో లభించడం, సాగు చేయడం ద్వారా ఏటా సగటున 2,23,960 టన్నులు చేపలు, రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో స్థానికంగా వినియోగం నామమాత్రమే. స్థానికంగా లభించే ప్రోటీనుతో కూడిన పోషకాహారం ప్రజలకు చేరువ చేయడానికే ఆక్వాహబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.  

సచివాలయాల పరిధిలోనే విక్రయాలు : జిల్లాలో గుంటూరు నగరంతోపాటు మరో ఐదు పట్టణాల్లో ఆక్వాహబ్‌లు ఏర్పాటుచేస్తారు. వీటికి అనుబంధంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి ఒక్కొక్క రిటైల్‌ దుకాణం ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క హబ్‌ నిర్మాణానికి రూ.5.48 కోట్ల సొమ్ము వెచ్చిస్తారు. 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆక్వాహబ్‌ ఏర్పాటు చేస్తారు. ఎసీˆ్స, ఎసీˆ్ట మహిళలకు 60 శాతం, ఇతరులకు 40 శాతం రాయితీ అందిస్తారు. హబ్‌లో ఆక్వా ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి శీతల గదులు, ప్రాసెసింగ్, విక్రయశాల, రెస్టారెంట్, సజీవ చేపల ట్యాంకు తదితర నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లి విక్రయించడానికి వీలుగా ఒక్కొక్క హబ్‌ కింద ఐదు సూపర్‌ స్టోర్లు ఉంటాయి. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న వ్యాపారులను ఎంపిక చేస్తున్నారు. రిటైల్‌ దుకాణాల ఏర్పాటుకు డ్వాక్రా, మెప్మా మహిళలతోపాటు నిరుద్యోగ యువతకు అవకాశం ఇస్తున్నారు. రిటైల్‌ దుకాణాలు అన్నీ ఒకే నమూనాలో ఉండేలా ప్రభుత్వం నిర్ణయించిన లోగోతో పాటు ఫిష్‌ ఆంధ్రా బ్రాండ్‌ పేరుతో నిర్మాణం చేస్తారు. 

రెండిందలా లాభం
జిల్లాలో ఉత్పత్తి అయిన చేపలు, రొయ్యలు, పీతలను స్థానికంగా విక్రయించే వెసులుబాటు పెరిగితే రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఎగుమతి చేయలేని పక్షంలో సైతం రైతులకు నష్టాలు రాకుండా ఆదుకోవచ్చనేది లక్ష్యం. రొయ్యలు, చేపల సాగు తక్కువగా ఉండే ఉత్తర భారతదేశంలో తలసరి వినియోగం 15 కిలోలు ఉండగా మనం సగటున 10కిలోల లోపే ఉన్నాం. ఆక్వా ఉత్పత్తులతోపాటు వాటితో తయారుచేసిన స్నాక్స్, ఆహార పదార్థాలు కూడా విక్రయిస్తారు. ఫిష్‌ ఆంధ్రా బ్రాండ్‌కు ప్రభుత్వ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం కల్పిస్తారు. మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణ ఉన్నందున నాణ్యత, ధర, తూకంలో మోసాలకు అస్కారం ఉండదు. రేపల్లె, నిజాంపట్నం, నగరం, పీˆవీపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలాల్లో రొయ్యలు, చేపల సాగుదారులను రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పాటుచేస్తారు. వీరి నుంచి ఆక్వాహబ్‌కు సరకు సరఫరా చేస్తారు. ఏ రోజు ధరలను ఆ రోజు నిర్ణయించి రైతులకు చెల్లిస్తారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరతోపాటు వినియోగదారులకు ధరలు అందుబాటులో ఉంటాయి. 

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని