logo
Updated : 02/12/2021 06:36 IST

ఆ తప్పులు.. మళ్లీ చేయొద్దు!  

 అవగాహన లేమితో ఇంజినీరింగ్‌లో సీటు కోల్పోయిన విద్యార్థులు
 రెండో విడత కౌన్సెలింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

బాపట్ల, న్యూస్‌టుడే  అవగాహన లోపం కొంతమంది విద్యార్థులకు ఇంజినీరింగ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు దక్కకుండా చేసింది. కన్వీనర్‌ కోటాలో సీట్లు ఉన్నా ప్రవేశం లభించక వందల సంఖ్యలో విద్యార్థులు ఆవేదనకు గురయ్యారు. తమకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉందో, ఆన్‌లైన్‌లో ఆప్షన్లు ఎలా ఇవ్వాలో తెలియకపోవడంతో ఐదు వేల మందికిపైగా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు, కళాశాలలో ప్రవేశాలు పొందలేకపోయారు. ఉన్నత విద్యామండలి ఈనెల 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌లో కొత్తగా ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశం కల్పించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు సరైన అవగాహనతో అప్రమత్తతతో వ్యవహరిస్తే ఎంపిక చేసుకున్న కళాశాలల్లో సీట్లు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అందరి చూపు.. సీఎస్‌ఈపైనే.. 
* విద్యార్థులు మంచి కళాశాలల్లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ కోర్సుల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 80 శాతం మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి ఆప్షన్లు పెట్టారు. ఇరవై శాతం మంది మాత్రమే ఈఈఈ, మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచులలో సీట్లు కోరుకుని పొందారు. సీఎస్‌ఈ, ఈసీఈ, ఐటీ కోర్సులకు మాత్రమే ఆప్షన్లు పెట్టడంతో కొందరికి సీట్లు రాలేదు. పలువురు విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో సీˆటు లభిస్తుందో కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. మూడు, నాలుగు కళాశాలల్లో మాత్రమే ఆప్షన్లు ఇవ్వడం వల్ల సీట్లు రాలేదు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ..
* రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇవ్వడానికి వరుసగా మూడ్రోజులు అవకాశం కల్పించారు. ఎక్కువ కళాశాలలు, బ్రాంచిలను ఎంపిక చేసుకుని ఆప్షన్‌ ఇవ్వాలి.
* మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు రెండో విడత కౌన్సెలింగ్‌లో వారి ర్యాంకు ఆధారంగా నచ్చిన కళాశాలల్లో ఏ బ్రాంచిలో సీట్లు వస్తుందో చూసి దానికనుగుణంగా సీటు ఎంపిక చేసుకోవాలి. 
* ఏపీఈఏపీసెట్ వెబ్‌సైట్లో పొందుపరిచిన కళాశాలల వారీగా ఏ ర్యాంకు వరకు సీట్లు వచ్చాయన్న సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. 
* మొదటి విడతలో సీటు వచ్చినవారు రెండో విడతలో అంతకన్నా మంచి కళాశాల, నచ్చిన బ్రాంచిలో సీటు ఎంపిక చేసుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు రిజిష్టర్‌ కాని వారు కొత్తగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈనెల 10న సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడించనున్నారు.
* కాస్త ఆర్థిక స్థోమత కలిగినవారు తమకు నచ్చిన కళాశాలలో సీఎస్‌ఈ కోర్సులో కన్వీనర్‌ కోటా కింద సీటు రాదని భావించి కేటగిరీ బీ కింద మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ఆప్షన్‌ ఇచ్చి ఎంపికయ్యారు. బ్రాంచిని బట్టి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు వరకు ఫీజు చెల్లించడానికి సిద్ధమయ్యారు. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద ‘సీ’ కేటగిరీలో సీఎస్‌ఈలో 2500 డాలర్లు నుంచి 5000 డాలర్ల వరకు చెల్లించి సీట్లు పొందారు. అందరూ సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ కోర్సుల్లోనే సీట్లు కావాలని పోటీ పడటం సరికాదని సీనియర్‌ ఆచార్యులు రామకృష్ణ చెబుతున్నారు. ఈఈఈ, మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరి కష్టపడి చదివి అవసరమైన నైపుణ్యాలు సాధిస్తే ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుందని సూచిస్తున్నారు. 

ప్రణాళికాబద్ధంగా ఆప్షన్లు ఇవ్వాలి 
రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చే ముందు ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రాధాన్యక్రమంలో నాలుగైదు మంచి కళాశాలల్లో కోర్సుల్లో సీటు కోసం జాగ్రత్తగా ఆప్షన్‌ ఇవ్వాలి. ఇప్పటికే సీటు వచ్చినా అంతకన్నా మంచి కళాశాలలో మంచి బ్రాంచిలో సీటు వచ్చే అవకాశం ఉంటే ఎంపిక చేసుకోవాలి. ఆప్షన్లు ఇచ్చే సమయంలో తప్పులు దొర్లకుండా అప్రమత్తంగా ఉండాలి. - విజయకృష్ణ, ఉపాధి కల్పనాధికారి, బీఈసీ 

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని