logo
Published : 02/12/2021 13:55 IST

Crime News: తల్లిని రోకలిబండతో బాదిన తనయుడు

కాకుమాను: గుంటూరు జిల్లా కాకుమాను మండలం వల్లూరులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిని తనయుడు రోకలిబండతో బాది హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఈమని శివారెడ్డి, సీతామహాలక్ష్మి(65) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రభాకర్‌రెడ్డి మద్యానికి బానిసై డబ్బుకోసం తరచూ తల్లితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఉదయం మద్యం తాగేందుకు డబ్బు కావాలంటూ తల్లిని అడగ్గా.. ఆమె అందుకు నిరాకరించింది. కోపోద్రిక్తుడైన ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో ఉన్న రోకలిబండతో తల్లి తలపై బలంగా బాదాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనలో సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పొన్నూరు రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, కాకుమాను ఎస్సై రవీంద్రబాబు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని