logo

ధాన్యం సేకరణపై అధికారులకు సూచనలు

జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి జిల్లా సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్‌ దిశానిర్దేశం చేశారు. మంగళ, బుధవారాలు కర్లపాలెం మండలం చింతాయపాలెం, యాజిలి, కర్లపాలెం రైతు భరోసా కేంద్రాలను సందర్శించి

Published : 20 Jan 2022 04:27 IST


అప్పికట్లలో రైతులతో మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి జిల్లా సంయుక్త కలెక్టరు దినేష్‌కుమార్‌ దిశానిర్దేశం చేశారు. మంగళ, బుధవారాలు కర్లపాలెం మండలం చింతాయపాలెం, యాజిలి, కర్లపాలెం రైతు భరోసా కేంద్రాలను సందర్శించి చింతాయపాలెంలో రాత్రి బస చేశారు. ధాన్యం సేకరణలో తీసుకుంటున్న చర్యలను ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 733 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి 8,791 రైతుల నుంచి 54,194 మెట్రిక్‌ టన్నులను కొనుగోలు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు కొనుగోలు చేశారన్నారు. గ్రేడ్‌-ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,960, కామన్‌ వెరైటీ ధాన్యం క్వింటాల్‌కు రూ.1,940 ధరలను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఖరీఫ్‌లో పండి కుప్పలపై ఉన్న ధాన్యం ఫిబ్రవరి నెలాఖరుకు నూర్చి కొనుగోలుకు తీసుకురావాలన్నారు. ఇ-కేవైసీ చేయించుకుని ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో కనపడని రైతుల రికార్డులను పోర్టల్‌లో కనపడేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు