logo

కొండవీడులో వేమన జయంతి నిర్వహించేలా కృషి

మహాకవి యోగి వేమన జయంతిని ఏటా కొండవీడు కోటపై ప్రభుత్వమే నిర్వహించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. యడ్లపాడు మండలం కొండవీడు కోటపై బుధవారం బాలభారతి సంస్థ, కొండవీడు అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో యోగివేమన జయంతి నిర్వహించారు.

Published : 20 Jan 2022 04:27 IST


యోగివేమన క్యాలెండర్లు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే రజిని, జేసీ శ్రీధర్‌రెడ్డి,
అటవీశాఖాధికారి రామచంద్రరావు, శివారెడ్డి తదితరులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: మహాకవి యోగి వేమన జయంతిని ఏటా కొండవీడు కోటపై ప్రభుత్వమే నిర్వహించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే విడదల రజిని పేర్కొన్నారు. యడ్లపాడు మండలం కొండవీడు కోటపై బుధవారం బాలభారతి సంస్థ, కొండవీడు అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో యోగివేమన జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే విడదల రజిని ముందుగా యోగివేమన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పద్యాల ద్వారా మంచిని బోధించి సమాజశ్రేయస్సుకు కృషి చేసిన గొప్ప కవి వేమన అంటూ కొనియాడారు. వేమన కొండవీడుకు చెందిన వ్యక్తి అని చెప్పేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. కొండవీడులో వేమన విగ్రహ ఏర్పాటుకు తనవంతు బాధ్యతగా కృషి చేస్తానన్నారు. కొండవీడు చరిత్రను భావితరాలకు అందించే ఉద్దేశంతో కోట ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు మాట్లాడుతూ కొండవీడు కోటపై రూ.13.35 కోట్లతో చేపట్టిన నగరవనాన్ని ఐదేళ్లలో పూర్తిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్‌ కె.శివారెడ్డి మాట్లాడుతూ వేమన కొండవీడుకు చెందిన వ్యక్తేనని చెప్పేందుకు ఆయన రాసిన ఊరుకొండవీడు అనే పద్యం సాక్ష్యంగా ఉందన్నారు. బాలభారతి సంస్థ అధ్యక్షులు యర్రం సాంబిరెడ్డి, వీవీఐటీ కళాశాల ప్రచురణ విభాగం కోఆర్డినేటర్‌ రవికృష్ణ, వేమన మహేష్‌, కవి వెంకటరెడ్డి వేమన పద్యాల గొప్పదనం వివరించారు. జేసీ శ్రీధర్‌రెడ్డి, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ విశ్వనాథం, ఎంపీపీ పిడతల ఝాన్సీరాణి, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఎంపీడీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని