logo

పోలీసు శాఖలో కొవిడ్‌ కలవరం

కొవిడ్‌ మహమ్మారి పోలీసుశాఖను కలవరపెడుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు విధులకు హాజరవుతున్న క్రమంలో పోలీసు సిబ్బంది పలువురు దాని బారిన పడుతున్నారు. ఇప్పటికే

Published : 20 Jan 2022 04:27 IST

గుంటూరు, న్యూస్‌టుడే : కొవిడ్‌ మహమ్మారి పోలీసుశాఖను కలవరపెడుతోంది. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, బందోబస్తు విధులకు హాజరవుతున్న క్రమంలో పోలీసు సిబ్బంది పలువురు దాని బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సీఐలు, ఎస్సైలతోపాటు సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక పోలీసుస్టేషన్‌లోనే ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. మూడు రోజుల నుంచి ప్రతి రోజు ఆ శాఖలోని పది నుంచి 20 మంది కొవిడ్‌ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 100 మంది వరకు చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీని ప్రభావం అంతకంతకు పెరుగుతుండటంతో ప్రతి పోలీసుస్టేషన్‌ను రోజూ శానిటైజ్‌ చేయించాలని, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించాలని అర్బన్, రూరల్‌ ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్, విశాల్‌గున్నీ ఆదేశాలు జారీ చేశారు. విధులు నిర్వహించే క్రమంలో వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరోనా బారిన పడిన వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి అన్నిరకాల వైద్య సేవలందించాలని ఎస్పీలు ఆదేశించారు. ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని