logo

రూ.70 లక్షలు తీసుకొని మోసం చేశాడు

ఓ వ్యక్తి భూములు కొనుగోలు చేస్తానని తన వద్ద రూ.70 లక్షలు తీసుకున్నాడు...ఆ తరువాత తన ఫోన్‌ బ్లాక్‌ చేశాడు...తాను మోసపోయానని..న్యాయం చేయాలని తాడికొండకు చెందిన ఒకరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ

Published : 20 Jan 2022 04:27 IST

 ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’లో ఫిర్యాదు 

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ఓ వ్యక్తి భూములు కొనుగోలు చేస్తానని తన వద్ద రూ.70 లక్షలు తీసుకున్నాడు...ఆ తరువాత తన ఫోన్‌ బ్లాక్‌ చేశాడు...తాను మోసపోయానని..న్యాయం చేయాలని తాడికొండకు చెందిన ఒకరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ స్పందిస్తూ తాడికొండ అర్బన్‌ పరిధిలో ఉన్నదని...అక్కడి ఎస్పీతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ స్పందించారు. ఫిర్యాదులు ఇలా ఉన్నాయి. 
* వినుకొండకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ తన 10 ఎకరాల పొలంలో జామ, జామాయిల్‌ తోట వేశానని, ఓ వ్యక్తి తన తోటలను నరికివేశాడని వాపోయాడు. దీనిపై ఎస్పీ స్థలం పత్రాలు తీసుకు వెళ్లి సీఐని కలిస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారన్నారు.
* కర్లపాలేనికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తాము రొయ్యల వ్యాపారం చేస్తుంటామని, తమ వద్ద ఓ వ్యక్తి సరకు తీసుకొని రూ.28.50 లక్షలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది.  స్పందించిన ఎస్పీ వారి వద్ద ఫిర్యాదు తీసుకొని వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ తన వద్ద ఓ మహిళ బ్యాంకులో తాకట్టు పెడతానంటూ రూ.10 సవర్ల బంగారం, అర కిలో వెండి తీసుకొని ఇబ్బంది పెడుతోందని వాపోయింది. దీనిపై ఎస్పీ అక్కడ పోలీసులతో మాట్లాడితే ఆమె వ్యక్తిగత కక్షతో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. మరోసారి విచారించి చర్యలు తీసుకోవాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని